Showing posts with label ఒక్క ప్రక్కటెముక… కొన్ని ఆలోచనలు. Show all posts
Showing posts with label ఒక్క ప్రక్కటెముక… కొన్ని ఆలోచనలు. Show all posts

Friday, 15 June 2012

ఒక్క ప్రక్కటెముక… కొన్ని ఆలోచనలు



ఆమె నా ప్రక్కటెముకని
చెప్పడానికి ఎర్రర్ లేని ప్రోగ్రాంలెన్ని చేసానో!

నాకు తెల్సిన కొలమానాల్తో
ప్రక్కటెముక ఇమిడిందో లేదో! ఎంత సందేహం!

రూపురేఖల్తో ఎంపిక
ప్రక్కటెముకగా అతుక్కుపోయే సాధనమా!!

ఆడంపై ఎప్పుడూ సందేహమే!
ఈవ్ తన ప్రక్కటెముకేనని హత్తుకున్నాడా??    

ఆడం ఎన్నికకు ఈవొక్కతే
నేటి ఆడంకు చుట్టూ ఈవ్‌ల సందడే!

నీ ప్రక్కటెముకకు స్క్రూలుంటాయా
ఇమడలేదని మార్చుకోడానికి!