నేను మద్యపాన వ్యసనంనుండి బయటపడటానికి కొన్ని ప్రయత్నాలు చేసాను. ఆ ప్రయత్నాలన్నింటిలో కవిత్వవాన్ని చదవటం అలవాటయ్యింది. నేను వినిపించిన కొన్ని కవిత్వం బాగుందని చాలమంది అంటుంటే పుస్తకరూపంలో ఒకచోట చేర్చాలని బుద్దిపుట్టింది. ఆ ప్రయత్నాలలో చాలా అనుభవాలే వున్నాయి. ఇది కవిత్వమే కాదన్నవారు, కవిత్వానికి నిర్దిష్టాలు తెలుసుకోవాలనే వారు, పద్యమే కవిత్వమన్నవారు, ఇంకా అభివ్యక్తులు, పదాలు పరిపుష్టి చెందాలి అన్నవారు... ఇలా కొంతమంది ఎదురయ్యారు. ఎవరేమన్నా ఇవి రాస్తూ రాస్తూ, చదువుతూ చదువుతూ నా అలవాట్లు మారిపోయాయి.(దానినుంచి బ్యటపడి దాదాపు 12 సంవత్సరాలయ్యింది) మనిషి అలవాట్లను మార్చగలిగిన అక్షరాలు ఏవైతేయేమిటని దైర్యంచేసి పుస్తకంగా రూపొందింది.
అమ్మ సంకలనం
నేను అమ్మ
రోడ్డుపై నేను ... అమ్మ అప్పుడే చీకటి పులుముకుంటుంటోంది చలి మెల్లగా పంజా విసురుతోంది శాలువా కప్పుకున్న... అమ్మ నడుస్తున్నాం ఇద్దరం దూరం తెలియకుండా ఏవో చెబుతోంది అమ్మ నేడు అదే దూరం అదే రోడ్డు అదే చలి చెంత అమ్మలేదు అయినా... ఎన్నో సంగతులు నన్ను కప్పేవున్నాయి శాలువాలా !