అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి)
Friday, 29 June 2012
ఏదీ ఒక్కటీ చిక్కదు
స్నానాల గదిలో
ముఖానికి సబ్బునురగైనట్టు
ఎన్ని ఆలోచనలో
తెరవలేని కన్నులతో ఎన్ని అవస్థలో
కడిగి ముఖాన్ని తుడుచుకుంటూ
కలాన్నందుకోబోతే ఏదీ ఒక్కటీ చిక్కదు
ఎటువైపుగా
ఏ నీటి మాటున జారిపోయిందో
ఇక పద్యంకోసం
పగలంతా వెదకులాట మొదలయ్యింది
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)