ఆలింగనమో, కరచాలనమో
కావాలని ఊగుతుంది మనసు
తెగని సమస్యలతో
రగిలి జ్వలిస్తున్న ఆలోచనల్తో ఒకసారి
వేడిరాజుకోని అలోచనల్తో
సమయాన్ని కత్తిరిస్తూ మరోసారి
అక్కడ నీవున్నావని
ఆకుపచ్చని సంకేతమొకటి కన్పిస్తుంది
నీకూ నాకూ మధ్య
రహస్య సొరంగమార్గాన్ని కలుపుతుంది
నిశ్శబ్దాన్ని ఛేదించే
మాటలుగా కాక
అనంత దూరాలను దగ్గరచేస్తూ
సంభాషణకోసం
జ్ఞాపకాలను తడిమి రేపేందుకు
అక్కడ నీవున్నావని
ఆకుపచ్చని సంకేతమొకటి కన్పిస్తుంది
సప్తసముద్రాల ఆవల
బయల్దేరిన సందేశం
అలలుఅలలుగా పయనించి చేరుకున్న
ఒకప్పటి లేఖల వయనాల్ని తోసి
రెప్పల శబ్దాలకతీతంగా
ఇక్కడే ఒదుగున్నానని చెప్పేందుకు
అక్కడ నీవున్నావని
ఆకుపచ్చని సంకేతమొకటి కన్పిస్తుంది
ఏంచేస్తుంటావో,
ఏ కంప్యూటరును వాడతావో
కూడలిలో
నిలబెట్టిన విగ్రహంలా
వులకవు పలకవు స్పందన లేకుండా
విస్తృతమైన సాంకేతిక జ్ఞానాలమధ్య
సమయమేదైనా ఏదోచేస్తూ
అక్కడ నీవున్నావని
ఆకుపచ్చని సంకేతమొకటి కన్పిస్తుంది
కావాలని ఊగుతుంది మనసు
తెగని సమస్యలతో
రగిలి జ్వలిస్తున్న ఆలోచనల్తో ఒకసారి
వేడిరాజుకోని అలోచనల్తో
సమయాన్ని కత్తిరిస్తూ మరోసారి
అక్కడ నీవున్నావని
ఆకుపచ్చని సంకేతమొకటి కన్పిస్తుంది
నీకూ నాకూ మధ్య
రహస్య సొరంగమార్గాన్ని కలుపుతుంది
నిశ్శబ్దాన్ని ఛేదించే
మాటలుగా కాక
అనంత దూరాలను దగ్గరచేస్తూ
సంభాషణకోసం
జ్ఞాపకాలను తడిమి రేపేందుకు
అక్కడ నీవున్నావని
ఆకుపచ్చని సంకేతమొకటి కన్పిస్తుంది
సప్తసముద్రాల ఆవల
బయల్దేరిన సందేశం
అలలుఅలలుగా పయనించి చేరుకున్న
ఒకప్పటి లేఖల వయనాల్ని తోసి
రెప్పల శబ్దాలకతీతంగా
ఇక్కడే ఒదుగున్నానని చెప్పేందుకు
అక్కడ నీవున్నావని
ఆకుపచ్చని సంకేతమొకటి కన్పిస్తుంది
ఏంచేస్తుంటావో,
ఏ కంప్యూటరును వాడతావో
కూడలిలో
నిలబెట్టిన విగ్రహంలా
వులకవు పలకవు స్పందన లేకుండా
విస్తృతమైన సాంకేతిక జ్ఞానాలమధ్య
సమయమేదైనా ఏదోచేస్తూ
అక్కడ నీవున్నావని
ఆకుపచ్చని సంకేతమొకటి కన్పిస్తుంది
*****
ఆలింగనమో, కరచాలనమో కావాలని ఊగుతుంది మనసు
తెగని సమస్యలతో రగిలి జ్వలిస్తున్న ఆలోచనల్తో ఒకసారి
వేడిరాజుకోని అలోచనల్తో సమయాన్ని కత్తిరిస్తూ మరోసారి
అక్కడ నీవున్నావని ఆకుపచ్చని సంకేతమొకటి కన్పిస్తుంది
నీకూ నాకూ మధ్య రహస్య సొరంగమార్గాన్ని కలుపుతుంది
నిశ్శబ్దాన్ని ఛేదించే మాటలుగా కాక, అనంత దూరాలను
దగ్గరచేస్తూ సంభాషణకోసం, జ్ఞాపకాలను తడిమి రేపేందుకు
అక్కడ నీవున్నావని ఆకుపచ్చని సంకేతమొకటి కన్పిస్తుంది
సప్తసముద్రాల ఆవల బయల్దేరిన సందేశం అలలుఅలలుగా
పయనించి చేరుకున్న ఒకప్పటి లేఖల వయనాల్ని తోసి
రెప్పల శబ్దాలకతీతంగా ఇక్కడే ఒదుగున్నానని చెప్పేందుకు
అక్కడ నీవున్నావని ఆకుపచ్చని సంకేతమొకటి కన్పిస్తుంది
ఏంచేస్తుంటావో, ఏ కంప్యూటరును వాడతావో కూడలిలో
నిలబెట్టిన విగ్రహంలా, వులకవు పలకవు స్పందన లేకుండా
విస్తృతమైన సాంకేతిక జ్ఞానాలమధ్య సమయమేదైనా ఏదోచేస్తూ