జాన్ హైడ్ కనుమూరి
దేహాన్ని
గాలిలో తేల్చి వుంచాలనుకుంటాను
అది ఎగరడమని
నీవంటావు
ఆకర్షణేదో క్రిందికి లాగిపెడ్తుంది
నా ప్రయత్నాలకు రెక్కలులేవని
గుర్తుకొస్తుంది
గమ్యాన్ని చూసే కళ్ళపై రెప్పలు భారమనిపిస్తాయి
కునుకుపడిందో
కలలన్నీ భూకంపపు భవనశిధిలాలౌతాయి
భారమైన కదలికల్లోంచి
కుబుసం
విడిచిన దేహం విడిపోతుంది
అడుగులు చక్రాలై కదిలిపోతాయి
చాపిన హస్తం
అందుకోవడానికి వురకలువేస్తుంది
నిలిపినచూపు
నిరంతరం సంఘర్షణల మధ్య
నలుగుతూంది
రెక్కలగుఱ్ఱంపై రాజకుమారుడు నావైపే వస్తుంటాడు