ఉదయానికి ఒకటే ఫెంటోలు!!
* * *
తెలిసిందేమిటో తెలుసా
ఆనందం పంచడం, అవమానాల్ని దిగమింగడం
* * *
అక్షరాల మధ్య వెదకులాట
జుంటేతేనేదైనా దొరుకుతుందేమోనని
* * *
ఒకటినుండి ముప్పై వరకు
తెగని లెక్కలు.. మళ్ళీ ఒకటికోసం
* * *
నవ్వినప్పుడు పడేసొట్ట
ఏడ్చినప్పుడు పడదెందుకనీ?
***
నొక్కిపట్టడం నీకు తెలిసి
ఎగరడం నేర్పావు.... ఎంతైనా మెలితిప్పావుగా...
***
రక్త ప్రవాహం పైపైకి
సెన్సెక్స్ సూచిక పడిందిగా...
***
మనిషున్న చోటే కూలబడ్డాడు
నిలుచున్న నేలపై రింగురోడ్డెక్కింది
***
జల్లించడం తెలిస్తే కదా!!
నూకలేవో తెలిసేది!!