నాన్న జ్ఞాపకంగా రాసిన నాలుగు అక్షరాలకు స్వరపరిచి వినేసరికి ఎందుకో వెంటాడుతూవుంది.
అందుకే కొన్ని చరణాలుగా చేర్చడానికి సాహసిస్తున్నాను
* * *
బాధలోనూ సంతోషంలోనూ
హల్లెలూయా అన్న స్వరం మూగబోయింది
గడచిన కాలంలో జ్ఞాపకాలు వెంటాడుతాయి
నన్ను ఎత్తుకొని ఆడించిన చేతులు
కళ్ళెదుట లేకున్నా
జీవిత నడక నేర్పటంకోసం గోదావరి ఇసుక తెన్నెలపై నడుస్తూ
చెవిలో చెప్పిన సంగతులు ధ్వనిస్తునే ఉన్నాయి
నాన్నా!
నిన్నే ప్రేమిస్తున్నాను
జీవితమంటే చంద్రమాన లెక్కలు కాదు
ఎవరో ఒకరిని తాకిన క్షణాలు జ్యోతులై వెలుగుతూనే ఉంటాయి
నాన్న! నీవే స్పూర్తి దాయకం
ముదిమి వచ్చువరకూ ఎత్తుకునే వాడున్నాడనే నమ్మకం
జీవిత పదానా మిమ్మల్ని నడిపించీ, మమ్మల్నీ నడిపిస్తూనే ఉంటుంది
నాన్నా! నువ్వే గొప్ప సాక్ష్యం
***