Friday, 29 June 2012

ఏదీ ఒక్కటీ చిక్కదు


స్నానాల గదిలో
ముఖానికి సబ్బునురగైనట్టు

ఎన్ని ఆలోచనలో
తెరవలేని కన్నులతో ఎన్ని అవస్థలో

కడిగి ముఖాన్ని తుడుచుకుంటూ
కలాన్నందుకోబోతే  ఏదీ ఒక్కటీ చిక్కదు

ఎటువైపుగా
ఏ నీటి మాటున జారిపోయిందో

ఇక పద్యంకోసం
పగలంతా వెదకులాట మొదలయ్యింది

3 comments:

the tree said...

simple and different one, keep writing.

కనకాంబరం said...

మాయా మోహమనే సబ్బు నురగ అంతరంగాన్ని కప్పి ఉంచినపుడు ఎన్నెన్ని అవకాశాలు చేతికి చిక్కి నట్లే చిక్కి తప్పించుకుని ఉంటాయో కదా?...Nutakki .

Sai said...

భలే రాసారు అండీ...