రాజేశ్ ఖన్నా
********
ఒక దేహం
కనుమరుగౌతుంది
కాలంలో తీపి
జ్ఞాపకాలే తెరపైకొస్తాయి
జిందగీ ఎక్ సఫర్
హై సుహానా
నాటి నాల్కలపై
నడయాడిన గీతలహరి
జ్ఞాపకం రైల్లో
ప్రయాణిస్తుంటుంది
తలపు రోడ్డువెంట
రైలును వెంబడిస్తుంది
సన్నని
మౌతార్గాన్ సంగీతం
పెదాల్లోంచి
చెవుల్లోకి ప్రవహిస్తుంది
షర్మిలా, హేమ, ఆశా, ముంతాజ్
ముచ్చటైన అభినయ
జంటలై అలరిస్తుంటారు
లోకులు ఏదొకటి
అంటుంటే
ఎవరి మాటలు
వారికే వదిలేసిన జీవితం
అచ్చా తో హమ్
చల్తే అంటూ
మళ్ళీరాని చోటు
వెదక్కుంటూ ఊపిరి
ఆరాధించిన కళ్ళూ, మనస్సు
అలరించిన
చిత్తరువెంట పరుగులు తీస్తుంది
పల్ పల్ దిల్‌కే
పాస్
కుచ్ బాతే ..
ఉన్ మే సె కుచ్ యాద్ రహజాతేహై!