- మనసు, పరిస్థితులు చాలా అలజడిగా వున్నాయి. అందుకే చాలా రోజులుగా వివిధ కారణాలవల్ల ఒక్క కవితా వాక్యాన్ని చదవలేదు, రాయలేదు.
అలజడిచెందిన మనసు, పరిస్థితులు, ఆలోచనల మధ్య కొన్ని వాక్యాలు ఇలా వొదిగాయి.
ఇక రాసాక మనసు వూరుకోదు కదా ఓ కవిమిత్రునికి వినిపించాను. ఆయన చేసిన వ్యాక్యలు నన్ను ఆలోచింపచేసాయి.
మొదటి రాసిన దానినే మరోధ్వనితో రాయడం జరిగింది.
ఆ రెండు కవితల్నీ మీ ముందుచుతున్నాను. మీరు యేమనుకుంటున్నారో చెప్పండి.
***
ఓడిగెలిచిన రాత్రి
యవ్వనాన్ని ధరించిన దేహం
కోర్కెలకు కళ్ళాలను తెలుసుకుంటూ
పెనవేసుకున్న రెండుదేహాలు
రాత్రిని చీల్చుకుంటూ
ఆకాశపు అంచులను తాకుతున్నట్టు పరుగులు
ఒలికిన నీరు మెల్లగా జారుతున్నట్టు
మరుగుతున్న పాలు పొంగుతున్నట్టు
కణం కణం రగిలిన అగ్నికణం
చెలరేగే మంటలై
అడివంతా దహించే జ్వాలలైనట్లు
కన్ను గానని చీకటిలో
భయమెరుగనిపోరు
పల్నాటి పందెపు కోళ్ళలా
రాత్రిని చెమటిచుక్కలుగా మారుస్తూ
జ్వలించే దేహపు కణాలను ప్రజ్వలిస్తూ
దేహాలతాకిడిమధ్య ఆర్పివేయాలనే ప్రయత్నం
ఎవరికి ఎవరు పోటీ
ఎవరికి ఎవరు భేటీ
సమానమైన నిట్టూర్పులసెగలు కుడి ఎడమల సైకిల్ పెడలింగులా
వడివడిగా కదులుతూ
తుది తీరం
మది సుదూరం
ఆకును తాకిన
మంచుబిందువు జారిపడ్డట్టు
క్షణమెనుక ఒక్కక్షణం
యుగాల నిరీక్షణ అంతమైనట్టు
అంపశయ్యపై దాహార్తి తీర్చేందుకు
పాతాళగంగ పైపైకి వచ్చినట్టు
నలిగిన దేహమో
సహకరించిన మోహమో
గెలుపు జెండా ఎగిరే
రెప్పల రెక్కలపై
అతడు గెలిచాననుకుంటాడు
అతన్ని గెలిపించే సూత్రంలో
అతడ్ని గెలిచే రహస్యపు తాళపుచెవి
నాలోనే దాచుకుంటూ
అరాత్రి గెలుస్తూ ఓడిపోయాను
ఇక
తన జీవితవిజయాలలో
నేనే విజేత.
*****
2nd Version
ఓడిగెలిచిన రాత్రి
యవ్వనాన్ని ధరించిన దేహం
కోర్కెలకు కళ్ళాలను తెలుసుకుంటూ
పెనవేసుకున్న రెండుదేహాలు
రాత్రిని చీల్చుకుంటూ
ఆకాశపు అంచులను తాకుతున్నట్టు పరుగులు
ఒలికిన నీరు మెల్లగా జారుతున్నట్టు
మరుగుతున్న పాలు పొంగుతున్నట్టు
కణం కణం రగిలిన అగ్నికణం
చెలరేగే మంటలై
అడివంతా దహించే జ్వాలలైనట్లు
కన్ను గానని చీకటిలో
భయమెరుగనిపోరు
పల్నాటి పందెపు కోళ్ళలా
రాత్రిని చెమటిచుక్కలుగా మారుస్తూ
జ్వలించే దేహపు కణాలను ప్రజ్వలిస్తూ
దేహాలతాకిడిమధ్య ఆర్పివేయాలనే ప్రయత్నం
ఎవరికి ఎవరు పోటీ
ఎవరికి ఎవరు భేటీ
సమానమైన నిట్టూర్పులసెగలు
కుడి ఎడమల సైకిల్ పెడలింగులా
వడివడిగా కదులుతూ
తుది తీరం
మది సుదూరం
ఆకును తాకిన
మంచుబిందువు జారిపడ్డట్టు
క్షణమెనుక ఒక్కక్షణం
యుగాల నిరీక్షణ అంతమైనట్టు
అంపశయ్యపై దాహార్తి తీర్చేందుకు
పాతాళగంగ పైపైకి వచ్చినట్టు
నలిగిన దేహమో
సహకరించిన మోహమో
గెలుపు జెండా ఎగిరే
రెప్పల రెక్కలపై
అతడు గెలిచాననుకుంటాడు
అతన్ని గెలిపించే సూత్రంలో
అతడ్ని గెలిచే రహస్యపు తాళపుచెవి
తనలోనే దాచుకుంటూ
అరాత్రి గెలుస్తూ ఆమె ఓడిపోతుంది
గంపక్రింద దాగిన కోడిపుంజు
వేకువకోసం
చీకటిని చీలుస్తుంది
ఆమె
ఓడిపోవడం
అలవాటు చేసుకుంటుంది
* * *
ప్రతి వేకువలో
మేల్కొలిపే కోడికూతల ధ్వని దూరమౌతుంటుంది
ఆ రాత్రి
మళ్ళీ మళ్ళీ రాదు
ఆ జ్ఞాపకాన్ని దాచుకోడానికి
జీవితకాలం సరిపోదు
* * *
ఇక
జీవిత విజయాలలో
ఆమె విజేత.
********************** 12.11.2012
Sunday, 18 November 2012
ఓడిగెలిచిన రాత్రి
Subscribe to:
Posts (Atom)