- రాత్రిమత్తుల రెప్పల్ని తెర్వగానే
తొలియవ్వనపు జ్ఞాపకమేదో వెంటాడింది***పరికిణీల నుండివోణియై ఎగిరొచ్చి సిగ్గై వాలింది***హత్తుకున్న అలజడిబడిగంటను మింగేసింది***పుస్తకాన దాగిననెమలీక పించమై నాట్యమాడింది***బదిలీలు నాన్నలకుమరి రంగులద్దిన ఆ క్షణాలకో!!***ఎవరున్నారు... స్నేహించిన పాదాలుఅడుగులకు మెరుగులద్దిన బడి తప్ప***ఎక్కడవుందో! ఎలావుందో!అప్పటి నా కళ్ళను కత్తిరించిన "ఇందిర"* * * * * *8వ తరగతి(1972)లో సహ విద్యార్థిని, ఓ రోజు ఓణీ ధరించిన జ్ఞాపకంమళ్ళీ ఎప్పుడూ తనని కలవలేదు.ఈ రోజు కళ్ళు తెరిచీ తెరవాగానే గుర్తుకొచ్చింది "ఇందిర"కు అంకితం