Saturday, 14 July 2007

నేను అమ్మ


నేను అమ్మ
రోడ్డుపై నేను ... అమ్మ
అప్పుడే
చీకటి పులుముకుంటుంటోంది
చలి మెల్లగా పంజా విసురుతోంది
శాలువా కప్పుకున్న... అమ్మ
నడుస్తున్నాం ఇద్దరం
దూరం తెలియకుండా
ఏవో చెబుతోంది అమ్మ
నేడు
అదే దూరం
అదే రోడ్డు
అదే చలి
చెంత అమ్మలేదు
అయినా...
ఎన్నో సంగతులు
నన్ను కప్పేవున్నాయి
శాలువాలా !

-----------------
అమ్మ జ్ఞాపకం

2 comments:

Unknown said...

జాన్ గారు, మీ చిన్న కవిత్వంలో జీవితం గురించి జీవితంలో అమ్మ తోడు గురించి చాలా బాగా చెప్పారు. మనసుకు హత్తుకునెలా ఉంది. మంచి కవిత్వంతో అమ్మను గుర్తు చెసినందుకు చాలా చాలా ధాంక్స్.

వెంకటెశ్వరరావు

Indu said...

జాన్ గారు,

మీ అలలపైకలలతీగ చాలా బాగుంది. నిజానికి బ్లాగ్ పేరే చాలా బాగుంది. ఇక కవితలు ఇంకా సూపర్.

నీను చాలా నేర్చుకున్నాను సార్.

మీకు ధన్యవాదాలు.

ఇందు.(నేనుమీరు.బ్లాగ్స్పాట్.కాం)