నేను మద్యపాన వ్యసనంనుండి బయటపడటానికి కొన్ని ప్రయత్నాలు చేసాను. ఆ ప్రయత్నాలన్నింటిలో కవిత్వవాన్ని చదవటం అలవాటయ్యింది. నేను వినిపించిన కొన్ని కవిత్వం బాగుందని చాలమంది అంటుంటే పుస్తకరూపంలో ఒకచోట చేర్చాలని బుద్దిపుట్టింది. ఆ ప్రయత్నాలలో చాలా అనుభవాలే వున్నాయి. ఇది కవిత్వమే కాదన్నవారు, కవిత్వానికి నిర్దిష్టాలు తెలుసుకోవాలనే వారు, పద్యమే కవిత్వమన్నవారు, ఇంకా అభివ్యక్తులు, పదాలు పరిపుష్టి చెందాలి అన్నవారు... ఇలా కొంతమంది ఎదురయ్యారు. ఎవరేమన్నా ఇవి రాస్తూ రాస్తూ, చదువుతూ చదువుతూ నా అలవాట్లు మారిపోయాయి. మనిషి అలవాట్లను మార్చగలిగిన అక్షరాలు ఏవైతేయేమిటని దైర్యంచేసి పుస్తకంగా రూపొందింది.
0 comments:
Post a Comment