Wednesday, 25 June 2008

అజా

ఆజ్ ఈ రోజే
నఖాబ్ వెనుకున్న
స్వరాన్ని చెవినవేసుకున్నాను
గొంతును గుళికగా
నా గొంతున మింగాను
ఇప్పుడే వాన మొగులు
అప్పుడే మెరుపుతీగలు
అంతలోనే వస్త్రం సహించని ఉక్కపోత
అప్పుడప్పుడూ దుప్పటి వెదకే చలి
ఎందుకో జ్వరమాని బద్దలయ్యింది
సరికొత్తరాగమేదో సుడులు తిరుగుతోంది
పల్లవించే బాటలో
గళం కలిపే పాటలో
ముళ్ళను పూలగా మార్చబోతూ
సరికొత్త అజా పిలుపు
నవోదయానికి మలుపు
ముళ్ళను నరుక్కుంటూ
పరచుకుంటున్న కొత్తబాట
కళ్ళలో ఇంకిపోతున్న నదులను
అక్షరాల రాడార్లలోకి
ఒకొక్కటిగా దృశ్యీకరిస్తున్న సాంకేతిక కన్ను
ఆధిక్యపు బుర్ఖాల వెనుక మెదలుతున్న
కంటికి కనబడని ఎన్నోక్రిములను వైరస్‌లను
ముందుంచుతున్న మైక్రోస్కోపు కన్ను
ఇన్సానియత్‌తో కవిత్వాన్ని పలవరిస్తున్న ఆర్తినాదం
ఇస్ హిమ్మత్‌కో సలాం
నడుంబిగించిన పైటకు ప్రణామం

షాజహానా - నఖాబ్ చదివి 14.3.2005

2 comments:

pruthviraj said...

నడుంబిగించిన పైటకు ప్రణామం, జాన్ గారు చాలా బావుంది కవితలో బావం.మనిషికి మనస్తైర్యాన్ని ఇస్తున్నారు కవిత చదివించి. నాకు నచ్చింది. ఇలాగే వుండాలి.

జాన్‌హైడ్ కనుమూరి said...

వర్మ గారు
మీ స్పందంకు నెనరులు