Wednesday 12 August, 2009

ఆమె నేను - రెండు దృశ్యాలు

దృశ్యం-1

మొదటిసారి
ఆమెను కలసినప్పుడు
నీటి చెలమనుకున్నాను
సంవత్సరాలుగా
తోడిన నీటిలో
మునిగిన చెరువయ్యాను.


దృశ్యం-2

ఓ సాయంకాలం
గోదారి ఇసుకతెన్నెలపై
ఆమెను కలిసాను
పరిచయాలు స్నేహం ఇష్టం
ప్రేమగా మారాయి

సంవత్సరాల తర్వాత
అదే గోదారి
అదే ఇసుక
నడుస్తూ గడిచిపోయిన గతంలో
ఆమె నదిగా మారిపోయింది

నేనే
చెలమగా చూస్తుండిపోయా!

17 comments:

Bolloju Baba said...

అద్బుతంగా ఉందండీ
బొల్లోజు బాబా

Ramesh said...

wow... Hide garu, excellent, we missing your pen from long time. This one filled every thing... good one.

- Ramesh

Ramesh said...

wow... Hide garu, excellent, we missing your pen from long time. This one filled every thing... good one.

- Ramesh

Ramesh said...

wow... Hide garu, excellent, we missing your pen from long time. This one filled every thing... good one.

- Ramesh

MURALI said...

ఎప్పటిలాగే చాలా బాగుందండి. అయినా ఏంటండీ ఈ మధ్య బొత్తిగా కనబడటం లేదు.

జాన్‌హైడ్ కనుమూరి said...

@బొల్లోజు బాబా గారు

స్పందనకు నెనరులు

@రమేష్ గారు, @మురళిగారు
స్పందనకు నెనరులు
కొన్ని కారణాలవల్ల సాహిత్యానికి, అంతర్జాలానికి దూరంగా వుండవలసి వచ్చింది.

Anonymous said...

రెండు దృశ్యాలలోనూ మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఆమెకు ఇచ్చిన స్థానం అబ్బుర పరుస్తుంది
నిజంగా ఆమె ఎంత అదృష్టవంతురాలో కదా!

మళ్ళీ, మళ్ళీ చదివించి మనసు చెమ్మగిల్లుతుంది

అభినందనలు
అపూర్వ

ఏకాంతపు దిలీప్ said...

అవును అద్భుతం!

జాన్‌హైడ్ కనుమూరి said...

అపూర్వగారు
చెమ్మగిల్లిన తడి మీ మనసులోచే కాని నా కవిత్లో ఏముందండీ!
స్పందనకు నెనరులు

జాన్‌హైడ్ కనుమూరి said...

ఏకాంతపు దిలీపు గారు
అద్బుతం మీరు చదివే దృష్టి కోణంలో వుందండీ!

ఇదే పాదాలు కొదరికి చెత్తగా వుండవచ్చు

స్పందనకు నెనరులు

Rajendra Devarapalli said...

కాలేజీ రోజుల్లో బెజవాడ గోపాలరెడ్డి గారి `ఆమె ' సంపుటులు చదివాను.అవి అకస్మాత్తుగా గుర్తొచ్చాయి.తనను తాను తగ్గించుకొనువాడు అన్న సూక్తిని జాన్ గారు అద్భుతంగా చిత్రికబట్టి చిత్రించారు.కానీ వారెందుకో ఈ మధ్య కలం దూయటం లేదు

ఈగ హనుమాన్ (హనీ), said...

ఆమె యొక్క గొప్పతనాన్ని రెండు దృశ్యాల్లొ అద్భుతంగ చిత్రీకరించారు మిత్రమా!!
ఇది మీ చక్కటి కవిత్వానికి చిక్కటి నిదర్శనం,
అభినందనలతో
ఈగ హనుమాన్ (nanolu.blogspot.com)

జాన్‌హైడ్ కనుమూరి said...

రాజేంద్ర కుమార్ దేవరపల్లి
మీ కాలేజీ రోజుల్లోకి, బెజవాడ గోపాలరెడ్డి గారి `ఆమె ' సంపుటుల్లోనికి తీకెళ్ళగలిగినందుకు ఆనందిస్తున్నాను .

మీ అభిమానపూర్వకమైన స్పందనకు నెనరులు

జాన్‌హైడ్ కనుమూరి said...

ఈగ హనుమాన్ గారు

అభిమానపూర్వకమైన స్పందనకు నెనరులు

జ్యోతిర్మయి ప్రభాకర్ said...

వాహ్..చాలా బాగుంది

జ్యోతిర్మయి ప్రభాకర్ said...

వాహ్..చాలా బాగుంది

జ్యోతిర్మయి ప్రభాకర్ said...

వాహ్..చాలా బాగుంది