Wednesday, 13 July 2011
మట్టిపొరల్లో జ్ఞాపకాలు
ముద్దులొలికే పిల్లలు
తొలి అడుగులు నేర్చింది ఇక్కడే!
అడుగు వెంట అడుగేస్తూ
ఒకరివెంట మరొకరు
పరుగులు నేర్చింది ఇక్కడే..!!
చిట్టి తల్లులు
ఒలకబోసిన పసిడి పలుకులను
ముక్కున కరచి ఎత్తుకెళ్ళి
కొత్త గీతానికి
శృతిచేసుకున్న కోయిలలుండేవి..
కేరింతలు కొట్టిన ఆనందం
మతాబులై వెలిగి
తారాజువ్వలై ఎగసి పడిందిక్కడే!!!
బాల్యాన్ని వీడి
జీవిత పార్శవాలను
తెలుకుంటున్న వారికి కానుకగా
పుటంవేసిన జ్ఞాపకాలనుండి
పాదముద్రలు తనలో దాచుకున్న మట్టిని
బాల్కనీ కుండీలో నింపాలని వచ్చాను
ప్రతి ఉషోదయాన్ని
కిలకిలరావాల విడిదైన
ఆ చెట్టువేరును నాటాలని వచ్చాను
ఇపుడిక్కడ
బహుళ అంతస్తుల నిర్మాణం కోసం
పెద్ద పెద్ద గోతులు తీయబడ్డాయి
------------------------------
హైదరాబాదులో 1987-92 మధ్య ఇ.యస్. .ఐ. (సనత్ నగర్) క్వార్టర్లో వుండేవాళ్ళం
అక్కడే నాకు ఇద్దరు ఆడపిల్లలు కలిగారు.
ఈ మద్య ఎదో పనిపడి అటువైపుగా వెళెతే అక్కడ ఉన్న పరిస్థితి అది.
అభివృద్ధిని ఆహ్వానించాల్సిందే. పిల్లల జ్ఞాపకాలు లేకపోవడమే ఎంతత్వరగా మార్పులు వస్తున్నాయి అని చెబుతుంది.
Subscribe to:
Post Comments (Atom)
7 comments:
అన్నీ జ్నాపకాలుగా మారిపోతున్న తరుణాన్ని ఆర్థ్రంగా వ్యక్తపరిచారు సర్...
Super ga raasaaru!
manchipoem
last two lines chaala meaninful gaa unnayi bahula anthasthula kosam .....pedda gothulu theeyabaddai akkade undi kavitvapu cenuku.....love j
"పుటంవేసిన జ్ఞాపకాలనుండి
పాదముద్రలు తనలో దాచుకున్న మట్టిని
బాల్కనీ కుండీలో నింపాలని వచ్చాను"
ఆర్ద్ర హ్రుదయోద్భవ భావన . గ్రామాల లోనే బాల్య జ్ఞాపకాల చిహ్నాలు తొలగి పోతున్నాయి .ఇక నగరాల్లో చెప్పేదేముందని. ఇప్పుడు కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి బాల్యాన్ని స్మృతిగా భద్రపరుచుకోవడానికి. అప్పట్లో ఆ అవకాశాలు లేవు మన సంతతికి తెలియజేయడానికి.Sreyobhilaashi ...Nutakki.(Kanakaambaram)
పుటంవేసిన జ్ఞాపకాలనుండి
పాదముద్రలు తనలో దాచుకున్న మట్టిని
బాల్కనీ కుండీలో నింపాలని వచ్చాను
నాకు ఆ పాదాలు బాగా నచ్చాయి, జాన్!
చిట్టి తల్లులు
ఒలకబోసిన పసిడి పలుకులను
ముక్కున కరచి ఎత్తుకెళ్ళి
కొత్త గీతానికి
శృతిచేసుకున్న కోయిలలుండేవి..
ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ వాక్యాలు
wonderful
Post a Comment