పెదవుల కదలికల్లో
ధ్వనించే అంతరంగంతో సంభాషించాలి
సాంకేతిక పనిముట్లు శబ్దాన్నే అంతరీకరిస్తాయి
వ్యవహాళికెల్లిన చేతిస్పర్శ వాటికేం తెలుసు పాపం!
వంటరిరాత్రి మోసుకొచ్చే ధ్వనిచిత్రాలు
భయపెడుతూనో ముద్దాడుతూనో
సమూహాంతర ప్రవాహంలోకి నెట్టేస్తున్నాయి
నలుదిక్కులనుండి విసిరే వలలు
ఎదురెదురాగా వుంటూనే మనం
ముక్కలు ముక్కలుగా విసిరేయబడుతున్నాం
సంభాషణకోసం సమయాన్ని వెదుక్కునేలోగా
ముచ్చటపడ్డ రింగుటోను పాట
ఏదో మూలకు లాక్కెళుతుంది
ఎవ్వరూలేని తరగతి గది ఓమూల బెంచీలో
మనదైన ప్రపంచానికి ఎల్లలుగీస్తూ
ఎన్ని మాటలు ఎన్ని సంభాషణలు
రావిచెట్టుక్రింద ఎంకిపాటలతో
వర్డుస్వత్తు కీట్సుతో కలిపి
రాల్తున్న ఆకుల్ని ఏరుతూ
మారకంలేని చిరునవ్వుతో సంభాషణ కావాలన్పిస్తుందిప్పుడు
అక్షరీకరించలేని ఎన్నో సంభాషణలు
మెమరీనుంచి డిలీట్ అవుతూనేవున్నాయి
కాలానికి ఎదురీదడం కొత్తేమీ కాదు
కాలంలో కలిసిపోవడం పాతా కాదు
మాట్లాడలనే ఆశ
కోర్కై గూడుకట్టడానికి ప్రయాణిస్తుంది
------------------------------------------------------
if you wish to call me +91 9912159531 , 9700637732........................ 1.7.2012
11 comments:
వ్యవహాళికెల్లిన చేతిస్పర్శ వాటికేం తెలుసు పాపం!
bagundi
nice poem
వ్యవహాళికెల్లిన చేతిస్పర్శ వాటికేం తెలుసు పాపం!
bagundi
nice poem
satya
బాగుందండి
bhagundandi, kavitha,
Sir,
I read many of your poems,
they were simple,
but
meeru kavitvam raasekoddi,
adi inka inka common man
ki chere laaga vundaali.
I think this poem is missing something and your style of writing?
You can take this as a suggestion only if it meant it else you can leave safely.
Sir,
I read many of your poems,
admiring,SIMPLE.
But
mee poems inka inka
common man ki cheraali,
THAT SHALL BE THE MAIN MOTTO.
By this latest poem,
adi jaragademo anipistondi,
endukante ee poem bhaaramgaa vundi,
andariki touch cheyyademo, kavulaki
ki touch cheste matram?
You can take this as a suggestion if it is meant, or you can leave safely.
Satya gaaru, Padmaarpita gaaru, the tree gaaru thanks for ur comments
నా కవితలు చదువుతున్నందుకు ముందుగా ధన్యవాదాలు
నాకు చాలా సార్లు మీకొచ్చిన సందేహం వచ్చింది.
చిత్రమేమిటంటే నేను ఎప్పుడూ ఇది కవిత్వీకరించాలి అని ఎప్పుడూ రాయలేదండీ.
ఆ సమయంలో తరుముతు వస్తూనట్టు అక్షరాలు దొర్లిపోతాయి.
ఎక్కడైనా, ఎప్పుడైనా చదివినవి రాసేసానా అనే సందేహం కలుగుతూ వుంటుంది.
ఎక్కడో నేను రాసుకున్న మాట "కవిత్వం నన్ను నేను స్కాన్ చేసుకునే యాంటీవైరస్ " నన్ను నేను స్కాన్ చేసుకోవడమే ముఖ్యం సామాన్యునికి చేరిందా లేదా తర్వాత సంగతి.
అయినా మీరు చెప్పిన అంశాన్ని గుర్తు పెట్టుకుంటాను
ఎదురెదురాగా వుంటూనే మనం
ముక్కలు ముక్కలుగా విసిరేయబడుతున్నాం...
నిజమే....చాలా బాగుంది సార్..
thank you Varma gaaru
Post a Comment