Wednesday, 18 July 2012

రాజేశ్ ఖన్నా



రాజేశ్ ఖన్నా
********

ఒక దేహం కనుమరుగౌతుంది
కాలంలో తీపి జ్ఞాపకాలే తెరపైకొస్తాయి

జిందగీ ఎక్ సఫర్ హై సుహానా
నాటి నాల్కలపై నడయాడిన గీతలహరి

జ్ఞాపకం రైల్లో ప్రయాణిస్తుంటుంది
తలపు రోడ్డువెంట రైలును వెంబడిస్తుంది

సన్నని మౌతార్గాన్ సంగీతం
పెదాల్లోంచి చెవుల్లోకి ప్రవహిస్తుంది


షర్మిలా, హేమ, ఆశా,  ముంతాజ్
ముచ్చటైన అభినయ జంటలై అలరిస్తుంటారు

లోకులు ఏదొకటి అంటుంటే
ఎవరి మాటలు వారికే వదిలేసిన జీవితం

అచ్చా తో హమ్ చల్తే అంటూ
మళ్ళీరాని చోటు వెదక్కుంటూ ఊపిరి

ఆరాధించిన కళ్ళూ, మనస్సు
అలరించిన చిత్తరువెంట పరుగులు తీస్తుంది

పల్ పల్ దిల్‌కే పాస్
కుచ్ బాతే .. ఉన్ మే సె కుచ్ యాద్ రహజాతేహై!

6 comments:

dhaathri said...

hey very nice tribute john ....love j

వనజ తాతినేని/VanajaTatineni said...

నాలో ఉన్న అస్పష్ట భావనల్ని ఇక్కడ చూస్తున్నాను. చాలా బాగా చెప్పారు.
ఒక జీవిత ప్రయాణం ముగిసిపోయింది. ఆ ప్రయాణికుడిని తలచుకుంటూ..కొందరు ప్రయాణికులు. జ్ఞాపకాల పట్టాల పై..
అభిమాన నటుడుకి అశ్రు నివాళి

Raj said...

చాలా బాగా నివాళ్ళు అర్పించారు..

Nutakki Raghavendra Rao. said...

అద్భుత హ్రుదయోద్భవ భావ తర్పణం .ఆ మహానటునికి...nutakki Raghavendra Rao.

జాన్‌హైడ్ కనుమూరి said...

Thanks to all

జాన్‌హైడ్ కనుమూరి said...

thanks to all