ప్రయత్నమో
నచ్చిన దానివెంట పరుగులు
తీరాల వెంబడి
మైదానాలవెంట
ఎవ్వరేమనుకుంటే నాకేం
ఎవ్వరు నవ్వుకుంటే నాకేం
రహస్యమార్గాలేవీ బోధపడవు
అష్టాచెమ్మా ఆటలో గవ్వలు కదిల్చినట్టు
తొక్కుడుబిళ్ళాటలో మువ్వలు సవ్వడిచేసినట్టు
నేనాడే పదరంగాన్ని
చెరుపుకుంటూ తిరిగి రాసుకుంటూ
ఆటలో అరటి పండునై, బట్టమీద బంగారాన్నై
చదరంగం రాకున్నా
నలుగురిలో నేర్చుకున్న చతురతా పావులు కదుపుతూ
ముఖ పుస్తకం పేజి కదిలేలోగా
నాలుగు లైకులు
నాల్గయిన రెండు కామెంట్లకు ప్రతికామెంట్లు
సమయ గడిచిపోయిన స్పృహేలేదు
తూర్పునున శుబోదయం
పశ్చిమాన శుభసాయత్రం
***
మళ్ళీ పరుగులు
వేరే ఎటువైనా పరుగెట్టవచ్చుగా
నిద్రలేచి కళ్ళు నులుముకున్నట్లు
అంతా కొత్తే కదా!
ఎటువైపైతేయేం పరుగేగా కావల్సింది
****
2 comments:
అవును ,ప్రస్తుత జీవన గమనం ఓ పరుగే దేని కోసమో పరుగులు వాడితో నేనూ... లేకుంటే వెనుకబాటు అనుకుంటూ.... ప్రతీ వాడూ పరుగులు పరుగుల వేటలో పడిలేస్తూ... ఎన్ని సార్లు పడ్డాడో లేచాడో మిగిలేదదే తీరిగ్గా లేక్కిన్చుకోడానికి అంతిమంగా. జీవితం ఓ పడిలేచే కెరటం మరి.. బాగుంది మాష్టారూ డియర్ జాన్ సాబ్.నూతక్కి రాఘవేంద్ర రావు.(కనకాంబరం)
thank you
నూతక్కి రాఘవేంద్ర రావు.(కనకాంబరం) gaaru
Post a Comment