ఒకప్పుడు భయంలేని రాత్రి
ఇప్పుడు భయపెడుతోంది
ప్రతినిత్యం ఏదొక కల
నిద్రలోనే జారిపోతుంది
యవ్వనాన్ని నింపుకొని నడుస్తున్న
దారిలో
ఎండను మబ్బుకమ్మినట్టు
ఆవహించిన ఒకానొక క్షణం
గమ్యం కానరాని
నిశిరాత్రి రంగుపులిమి
ఎన్నటికీ తరగని ఎడారులపైపు రాత్రిని
పరిచింది
యవ్వనాన్ని సాహసంచేసి నడుస్తున్న
దారిలో
చీకటినిఛేదించే ఆలోచనాయుధం
ఆవహించిన ఒకానొక క్షణం
ఆకులు, కొమ్మలు కప్పుకున్న
నిఘూడ అడవిలో
రాత్రిచేసే కీచురాళ్ళధ్వని సంగీతాన్ని
ఒంపింది
యవ్వనాన్ని మేథో కవనంచేసిన దారిలో
ఆకర్షించిన డాలరుగీతం
పొదలనుదాటి పుప్పొడులను దాటి
డయస్పోరాలను కౌగలించుకున్న క్షణం
నా రాత్రులనన్నీ మింగేసింది
కుబుసం విడిచినట్టు
రాత్రిని వదిలేయాలని ప్రయత్నం
ఎంతకీ విడవదే !
2 comments:
రేయి అంటేనే భయం.....కుబుసం విడిస్తే :-)
Padmarpita gaaru
మీ కామెంటు అసంపూర్ణంగా అనిపిస్తుంది
Post a Comment