Monday, 30 September 2013

ప్యార్ హువా ఎక్‌రార్ హువా




ఇన్నేళ్ళ తర్వాత 
మళ్ళీ
నర్గీస్ నీపై ప్రేమ పుట్టింది

వర్షం కురుస్తున్న రహదారిపై 
ఒంటరితనం బిక్కుబిక్కు మంటోంది
ఇప్పుడు ఎక్కడ వెదాకాలి?

ఇప్పుడు కూడా గుండె వేగంగా కొట్టుకుంటుంది

కాలం రహదారిపై వాహనమై లైట్లు వేసుకుని నిన్ను దాటిపోయి 
కనుచూపులో కనుమరుగయ్యింది

ఎక్కడవెదకాలి నిన్ను?
జ్ఞాపకాల గుర్తులు మిగిలేవుంటాయిలే ఎప్పటికీ.



(ప్యార్ హువా ఎక్‌రార్ హువా - శ్రీ 420 పాట చూసి )
http://youtu.be/y01uvU0UAoU

1 comment:

Unknown said...

నర్గిస్ నటన రాజ్ కపూర్ తో నటించేటప్పుడు బాగా పండింది!మదర్ ఇండియా లో నటన పరాకాష్టకు చేరుకొని ఆనక సునీల్ దత్ ను పెళ్లి చేసుకొని సినిమాలకు స్వస్తి చెప్పింది!రాజ్యసభ సభ్యురాలిగా సత్యజిత్ రాయ్ సినిమాలు భారతదేశ దారిద్ర్యాన్నే ప్రముఖంగా చూపాయని విమర్శించి ఒక వివాదాన్ని సృష్టించింది!ఆమె నటించిన సినిమాలు నా హోం థియేటర్ లో మళ్ళీ మళ్ళీ చూస్తూ ఆమె నటనకు ఇప్పటికీ ఆనందిస్తుంటాను!