Monday, 25 November 2013

తెరముందు - తెరవెనుక

తెరముందు సన్మానాలు
తెరవెనుక అవమానం
చూస్తున్న కళ్ళకు కత్తెరపడ్డదేదీ తెలియదు

**
కళ్ళు ముందుకే చూస్తుంటాయి
మనసు నలుమూలకు తిరిగి చూస్తుంది
**
బూడిదెకు ప్రతిగా పూదండను
దుఃఖమునకు ప్రతిగా అనంద తైలమును
అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను
నూతనమైన పేరును కలిగి
రక్షణవస్త్రాన్ని కప్పినవాడు నిరంతము వెంటున్నాడు
**

అవమాన కర్త స్థానం కాళ్ళక్రిందేనని మర్చిపోకు

2 comments:

Meraj Fathima said...

సన్మానించాము అనుకున్న మనుషుల మనస్సుల మైల తొలిగిన రోజు, తెరవెనుక అవమానాలు తొలగిపోతాయిం
మీ కవితలెప్పుడూ ఆలోచిమపచేస్తాయి .

జాన్‌హైడ్ కనుమూరి said...

Thank you Meraj Fathima gaaru