Friday, 18 September 2009

చెక్కుకొనే నవ్వు

నిన్నటి నవ్వు
నేటిదాకా దాచుకోలేను
నిన్నటి దుఖాన్ని నేటిదాకా మోయలేను
నువ్వు మారుతున్నట్టే
నేను మారుతున్నట్టే
కనులేవో మురిపిస్తుంటాయి

నీటి అలలపై తేలియాడుతున్నట్టు
చూపులు పడవలై సాగిపోతాయి
చెక్కుకుంటున్న శిల్పాలన్నీ
వెక్కిరిస్తుంటాయి

ఏ ఒక్కటీ
నిలువలేని నిజాన్నేదీ వొలకబోయదు

రెప్పలార్పని కళ్ళలో
జీవంలేని కిరణాలు ప్రసరిస్తుంటాయి

జారుకుంటున్న నిశ్శబ్దంలోకి
మెల్లగా లాక్కుపోతుంది

మళ్ళీ ఏదో నవ్వు చెక్కుకుంటూ
ముఖంపై పులుముకొని
మార్చుకుంటూ పాడుతుంటాను.

http://prajakala.org/mag/2009/08/chevvu_kone_navvu

3 comments:

Padmarpita said...

బహు బాగుంది!!!

జాన్‌హైడ్ కనుమూరి said...

పద్మార్పిత గారు
కొంతకాలంగా కుంటుపడిన నా బ్లాగుల ప్రయాణం కొచెం కొంచెంగా ముందుకు సాగుతున్న తరుణంలో మీ పలరింపుకు
నెనరులు

cartheek said...

bavindanDi...