ఆట వినోదమైన చోట
పావులతోనో
జీవులతోనో
కొనసాగుతూనేవుంది
ఆట కోసం
పావునేదో కదపటం
ఆట కోసం
స్క్రూ బాలుతో
బోర్డంతా
బాలును పరుగులెత్తించడం
ఆటకోసం
కోడిపుంజుకు
జీడిపప్పుతో మేపి
కాళ్ళకు కత్తులు కట్టడం
ఆట కోసం
ఆకలి బానిసచేసి
వేటాడే బోనులో పడేయడం
ఆట కోసం
కుక్కపిల్లకు
అద్దంలోనో
భూతద్దంలోనో
ప్రతిభింభాన్ని చూపి
దొరికిన ముక్కను లాక్కోవడం
మానసిక ఆట
రాజరికపు ఆట
రాజకీయ ఆట
ఇప్పుడు ఆటొక ప్రతీక
ఆటల మైదానంలో
సోలిపోయి ఓడిపోయిన
దేహంపై అమానుషంగా
నడిచే అడుగులను
'are you nat entertained'
అని ప్రశ్నించే
గ్లాడియేటర్ కోసం
ఎదురుచూపు కొనసాగుతూనేవుంది
పావులుకదిపే
ఆలోచనా ప్రవాహానికి
కత్తెర నేనైతే
పరులెత్తించే బంతికి
బ్యాటును నేనైతే
ముక్కల కోసం కాక
విందుకోసమే నేనైతే
వంగి వంగి సలాము కాదు
భుజం కలిపి
నడిచే నవతరానికి
పదండి ముందుకు
నేనున్నా లేకున్నా
జాడలను వెతుక్కుంటూ
పదండి ముందుకు...
6 comments:
చైతన్యవంతంగా ఉంది మీ కవిత...పదండి ముందుకు!
బాగుందండి.
Padmarpita
Thanks for responding
సృజన గారు
ఏమి బాగుందో చెబితే బాగుండేది
namaste sir. poem is ok.
@జాన్ హైడ్ గారూ..కొన్నేళ్ళ క్రితం విజయవాడ లో, "ఎక్స్ రే" వారి 24 గంటల కవి సమ్మేళనం జరిగింది..మీరు అక్కడికి ఏమైనా వచ్చారా... ? మిమ్మల్ని ఇంతకూ ముందెక్కడో కలిసినట్టుగా ఉంది..అందుకే అడుగుతున్నాను..
Post a Comment