Sunday 7 October, 2012

జనం సంఘమిస్తారు


ఇక్కడ 
మూడురోడ్లు కలిసే కూడలివుంది
చాలాకాలం నేనూ అలానే అనుకున్నా
కానీ ఆ కూడలిలో
అప్పుడప్పుడు
జనం సంఘమిస్తూవుంటారు

***
ఇక్కడైనా మరెక్కడైనా జన్మించినా
ఉనికిని వెదక్కుంటూనో
అస్థిత్వాన్ని కాపాడుకుంటూనో
తిరుగాడిన దేహం
పార్థివంగా మారినప్పుడు
పూడ్చడానికో, కాల్చడానికో
జనం సంఘమిస్తారు

స్మశానం

***
నమ్మిన సత్యాన్ని వెదక్కుంటూ
ఆత్మ ప్రాణ దేహాలతో

ఇకరిద్దరుగా కూడినచోటుల్లో
దేవుడుంటాడని
ఆరాధించాలంటూ

ఉరుకుల పరుగుల
లోకంలో తమకంటూ
సమయాన్ని కేటాయించుకుంటూ
అప్పుడప్పుడూ
జనం సంఘమిస్తారు

చర్చి

***
లోకంచేసే మాయాజాలం
వాణిజ్యాన్ని ప్రభుత్వం కనుసన్నల్లో

మత్తును నింపుకొనేందుకు
శ్రమను మర్చిపోవాలనుకుంటూ
సమయాన్ని ఆనందించాలనుకుంటూ
బానిసైన బ్రతుకై
నాలుకను చప్పరిస్తూ
కూలిపోతున్న కుటుంబాలను
మత్తువెనుక మర్చిపోయేందుకు

ప్రతినిత్యం జనం
సంఘమిస్తున్నే వున్నారు

బ్రాందీ షాపు

***
ఈ సంఘమాలను
ఎలా అర్థంచేసుకోవాలి??

ఈ సంఘమాల కూడలిని
ఎక్కడ ఎలా ఎక్కడ చిత్రించాలి
చరిత్ర పుటలపై.

********** 7.10.2012

3 comments:

Nutakki Raghavendra Rao. said...

పుట్టినపుడు ,చచ్చినపుడు ,మనుగడ సాగించినపుడు,మట్టిలోన కలుయునపుడు మనిషి సంఘమిస్తాడు. మనిషి సంఘజీవి. ఎక్కడైనా.....Nutakki Raghavendra Rao. ,

Nutakki Raghavendra Rao. said...

పుట్టినపుడు ,చచ్చినపుడు ,మనుగడ సాగించినపుడు,మట్టిలోన కలుయునపుడు మనిషి సంఘమిస్తాడు. మనిషి సంఘజీవి. ఎక్కడైనా.....Nutakki Raghavendra Rao. ,

జాన్‌హైడ్ కనుమూరి said...

Nutakki Raghavendra Rao gaaru


మనిషి సంఘజీవే కానీ
ఈ మూడవ సంఘమాన్ని
ఎలా అర్థంచేసుకోవాలి??

అనేది నా ప్రశ్న