ఇప్పుడెందుకో పదే పదే
కలకంటుంది నా మనసు
నువ్వు నా స్నేహానివో, బంధువువో, అభిమానివో ఎలా తెలిసేది?
వ్యాయమ నడకకోసం ఉదయమే వెళ్తున్నప్పుడు
సెల్లుఫోనులో రింగుటోనై పలకరిస్తావని
పనుల మధ్య చిక్కిన సమయంలో
చిరునవ్వుల పూలగుత్తులతో వచ్చి పలకరిస్తావని
కూడలిలో నిలబెట్టిన సిగ్నల్ దగ్గర
యాదృచ్చికంగా కనిపించి పలకరిస్తావని
నీవు మేల్కొన్న సమయం నాకు రాత్రే కావచ్చు
మార్కెట్టు మాలుల్లో వస్తువుల్ని వెతుక్కోగలం
నిన్నెలా వెదకేది అక్కడ?
అయినా
ఇది నా కలేనా!
నీ గురించిన కలనిజమయ్యేదెలా!
ఎవర్ని అడగాలంటావు?
***
బాల్యంలో గోదావరి ఇసుకలో
రంగురాళ్ళు ఏరుకున్నట్టు
వెన్నెలలో ఆరబోసిన అక్షరాలతో
ఇలా
ఎవో వెదకాలని కలకంటుంది మనసు
.............................................22.6.2013 08:15 hours ISD
1 comment:
బాల్యం నుండి యవ్వనం వరకు వచ్చాయిగా మీ కలలు.....మున్ముందు ఇంకెన్ని ముచ్చటైన కలలు చెప్తారు మాకు :-)
Post a Comment