పద్మగారూ
నేను కొన్నిసార్లు విచిత్రమైన పరిస్థితులలో అలాంటి ఒక పరిస్థితే ఇది. దీన్ని నాకు నేనుగా విమర్శించుకోవడం, అంచనా వేయడం సరి అయిన పద్దతి కాదుపద్మగారూ
నేను కొన్నిసార్లు విచిత్రమైన పరిస్థితులలో అలాంటి ఒక పరిస్థితే ఇది. దీన్ని నాకు నేనుగా విమర్శించుకోవడం, అంచనా వేయడం సరి అయిన పద్దతి కాదు. నేను వచనం రాయలేనని మీకు తెలుసు, అయినా వచనంలో రాయమన్నారు దీన్ని.
మీరు కోరిన దానికి వివరణ అనుకోవచ్చు లేదా వచనము అనుకోవచ్చు.
***
నిద్రలో ఎవరో డిక్టేట్ చేసారు నిద్రలేవగానే టైపుచేసి ప్రక్కన పెట్టాను, మర్చిపోయాను అనుకున్నా మళ్ళీ వెంటాడేసరికి మళ్ళీ మళ్ళీ నాకునేను చదువుకున్నాను. ఏమీ బోధపడలేదు. మీకు పంపితే ఎమైనా చెబుతారులే అనుకుంటే ఇంకో పని అప్పచెప్పారు. తర్వాత నా వత్తిడునుంచి బయట పడటానికి పోస్టు చేసాను.
***
సూర్పణక ఒకానొక సమయంలో లక్ష్మణుణ్ణి మోహించింది. మోహంనుండి వచ్చే తాపాన్ని తీర్చమని శతవిధాలా కోరింది. లక్ష్మణుడు తిరస్కరించాడు. ఇంకా విసిగించేసరికి ముక్కూ చెవులూ కోసి తన తిరస్కరణను చూపించాడు.
పరిణామంగా బంగారు లేడి ఎరాగా చూపి సీతాపహరణ, చివరికి లంకా యుద్ధంలో వీరులు మరణించేవరకూ దారితీసింది.
ఇక్కడ లక్ష్మణుడి గుణశీలతను మెచ్చుకోవాలా! లేక తర్వాత దారితీసిన పర్యవాసానాలను తలపోయాలా!!
**
యోసేపు తనకు కలిగిన ప్రావీణ్యంతో పోతీఫరు రాజుకు నమ్మకస్తుడుగా పనిచేయండవల్ల తన ఇంటిలోని పనులను రాజు అప్పగించాడు.
యోసేపు యవ్వనానికో స్పురదౄపానికో యోసేపును మోహించింది. తనకోర్కె తీర్చమని ఎవ్వరికీ అనుమానం రాద్నే నమ్మకమైన మాటలతో వశపర్చుకోవాలని చూసింది. అయినా తిరస్కరించడంతో రాజుకు అబద్దపు పిర్యాదును చేసి యోసేపును చెరసాలలో వేయించింది.
ఆమె మొహానికి లొంగితే జీవితం రాజభోగంగా వుండేది అని ఒక తలంపు. తిరస్కరణతో చెరసాల పాలైనా అది శాశ్వతమైనదేమీ కాదు. తర్వాతి కాలంలో తన గుణ శీలతను బట్టి రాజ్యములో పాధానమైన పదవికి దారి కలిగింది. ఈ యన వల్లనే కరువు కలిగిన సమయంలో ఇఋఆయేలీయులు ఐగుప్తుకు వలస వచ్చారు.
ఇక్కడ యోసేపు గుణశీలతను మెచ్చుకోవాలా! లేక తర్వాత దారితీసిన పర్యవాసానాలను తలపోయాలా!!
**
ఇవి రెండు భిన్నమైన మతనమ్మకాలనుండి, కాలాలనుండి ప్రతీకలు వీటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి?
**
ఇప్పుడు జరుగుతున్న దేశ ప్రాంతీయ రాజకీయాలను దీనితో ఏమైనా పోల్చుకోవచ్చా అని.
ప్రజలు ఎటు అవస్థలు పడ్డా, మనోభావాలు ఎలావున్నా ఎవరి లెక్కలు వారివి.
ఒకవేళ ఇది కలియుగం అందామా, అయితే రాజకీయాలు మలికే మాటలు
ప్రతీకలన్నీ ప్రక్కకుతోసి
ప్రధానపదవికోసం ముక్కుచెవులుకాదు ఎవరి గొంతైనా కోద్దాం
ఎవరు ఎవరినైనా మోహించి
శయనమందిర పరదాలన్నీ చించేద్దాం!!
వంగివంగి మోసే దేహాలపై బాహాటంగానే శయనిద్దాం
***
కవి గొంతుక కూడా ప్ర్శ్నగా ముగింపు. నిజానికి ఇది ముంగింపేనా అనేది ఇంకా మిగిలిన ప్రశ్న.
కాపాడాల్సింది ప్రధాన పదవొక్కటేనా!!!!!!
పొందాల్సిందీ ప్రధాన పదవొక్కటేనా!!!!!!
------------------
ఇది పద్మగారూ ఈ మధ్య కాలంలో నన్ను విసిగించి, వేధించిన ఒక కవిత.
ప్రతి రాతకు ఒక కవిసమం ఉంటుంది దాన్ని నేనుగా చెప్పుకోవడం సబబు కాదు అయినా (20/30 సార్లు చదివాక) ఇంతా రాస్తున్నప్పుడు అదిమాత్రం ఎందుకు వదిలేయాలి. అందుకే
**
ప్రతీకలుగా చెప్పబడినవాటిలోని సూక్ష్మాన్ని అన్వయించడం.
బహుశ ఈ లాంటి ప్రతీకలు (పురాణ/ఇతిహాస/చారత్రిక) ఇదివరలో రాసి వుండటంవల్ల సునాయసంగా చొప్పించడమేమో.
సామాజిక స్థితిగతులు, జరుగుతున్న మార్పుల మధ్య ఏమీ చెప్పలేక ఒక విసుగు కావచ్చు. లోలోపల దాగిన విసుగు ఇలా బయటికి వచ్చింది.
?? //జాన్ హైడ్ కనుమూరి//
----
మోహించేది
రాక్షసే కావచ్చు
ముక్కు చెవులు కోసింది లక్ష్మణుడే
వెనుకెనుక ఓ యుద్దానికి వ్యూహ రచన జరుగుతుంది
మోహించేది
రాణికూడా కావచ్చు
తిరస్కరింపబడిన బిగికౌగిలి
చెఱశాల పాల్చేస్తుంది
లొంగని గుణశీలత యోసేపుదే
చెఱశాలనుండి ప్రధానపదవికి వ్యూహ రచన జరుగుతుంది
***
రకరకాల మోహాలు, సన్మోహాలు మధ్య
లక్ష్మణుణ్ణి యోసేపులను గుర్తించడమెలా!!
***
ప్రతీకలన్నీ ప్రక్కకుతోసి
ప్రధానపదవికోసం ముక్కుచెవులుకాదు ఎవరి గొంతైనా కోద్దాం
ఎవరు ఎవరినైనా మోహించి
శయనమందిర పరదాలన్నీ చించేద్దాం!!
వంగివంగి మోసే దేహాలపై బాహాటంగానే శయనిద్దాం
***
కాపాడాల్సింది ప్రధాన పదవొక్కటేనా!!!!!!
పొందాల్సిందీ ప్రధాన పదవొక్కటేనా!!!!!!
.............................. ...........15.3.2014/16.3.2014
No comments:
Post a Comment